- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : టివీకే అధినేత విజయ్ తనకు శత్రువు కాదని సినీ నటుడు, ఎంపి కమల్ హాసన్ అన్నారు. కులతత్వమే తన ప్రధాన శత్రువని, దాన్ని అంతమొందించాలని చెప్పారు. కేరళలో నిర్వహించిన హార్టస్ ఆర్ట్, లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడారు. ‘విజయ్‌కు సలహా ఇచ్చే స్థితిలో నేను లేను. ఇది సరైన సమయం కాదు. అనుభవం మన కన్నా గొప్ప టీచర్. అది నేర్పే పాఠాలు ఎవరూ నేర్పలేరు. మనకు పక్షపాతం ఉండొచ్చు, కానీ అనుభవానికి ఉండదు’ అని తెలిపారు.
- Advertisement -



