Monday, December 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలువివాహ బంధంలోకి సమంత

వివాహ బంధంలోకి సమంత

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: అగ్రకథానాయిక సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో సమంత – రాజ్‌ నిడిమోరు పెళ్లి జరిగింది. ఈ మేరకు సమంత సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేశారు. సమంత-రాజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఈశా ఫౌండేషన్‌ ప్రకటన విడుదల చేసింది. అందులో వీరు భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఈ వివాహ విధానం గురించి అందరూ వెతుకుతున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక జరిగింది. కాగా ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -