Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సింగిల్ విండో డైరెక్టర్ పదవికి కొండావార్ అంజవ్వ రాజీనామా

సింగిల్ విండో డైరెక్టర్ పదవికి కొండావార్ అంజవ్వ రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ సింగిల్ విండో పరిధిలోని టిసి నంబర్ 9 సొసైటీ డైరెక్టర్ కొండావార్ అంజవ్వ తమ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మద్నూర్ సింగిల్ విండో కార్యదర్శి గంగాధర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పంచాయితీ ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి అడ్డు రాకుండా సింగిల్ విండో డైరెక్టర్ కు ముందు జాగ్రత్తగా తమ రాజీనామా ను సింగిల్ విండో కార్యదర్శికి సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 9వ టీసీ కి రాజీనామా చేసిన కొండా వార్ అంజవ్వ పత్రాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుందని, డైరెక్టర్ రాజీనామా గురించి విండో చైర్మన్ శ్రీనివాస పటేల్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -