- Advertisement -
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని కోటగడ్డ గ్రామపంచాయతీ ఏకగ్రీవం అయింది. ఈ పంచాయతీ సర్పంచ్ నామినేషన్లలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో పంచాయితీ ఏకగ్రీవం అయినట్లుగా అధికారులు ప్రకటించబోతున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా బానోత్ లిల్లీ నియామకం లాంచనం అయ్యింది. అంతేకాక మండల వ్యాప్తంగా 154 వార్డులలో 30 వార్డులకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్ దాఖలు కావడంతో వీటిని కూడా అదే రోజు ఏకగ్రీవమైనట్లుగా అభ్యర్థుల పేర్లతో సహా ప్రకటించనున్నారు. మరో నాలుగు వార్డులలో రంగాపురంలో ఒకటి కోట గడ్డలో మూడు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు.
- Advertisement -



