Monday, December 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుదేశంలోనే ఏడవ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా శామీర్‌పేట పీఎస్

దేశంలోనే ఏడవ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా శామీర్‌పేట పీఎస్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలోని ఏడో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్ పరిసర ప్రాంతమైన శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు చోటు దక్కింది. కేంద్ర హోంశాఖ ఏటా దేశవ్యాప్తంగా అత్యుత్తమంగా పనిచేసిన మొదటి 10 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలో, ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలవగా, శామీర్‌పేట పోలీస్ స్టేషన్ సైతం టాప్ టెన్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, ఏసీపీ మేడ్చల్ బాలగంగిరెడ్డిలు శామీర్‌పేట ఇన్‌స్పెక్టర్ సీఐతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్‌ల పనితీరు, రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వక ప్రవర్తన, ఫిర్యాదుల సత్వర పరిష్కారం, పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, పచ్చదనం, సిబ్బంది పనితీరు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర హోంశాఖ ర్యాంకులు కేటాయిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -