నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లొంగన్ గ్రామంలో మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా కార్యకర్తలతో కలిసి సోమవారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ఆచరణలో పెట్టిన మాజీ ఎమ్మెల్యే అకౌంటిత దీక్షకు జుక్కల్ నియోజకవర్గం భారీగా అభివృద్ధి చెందిందని ప్రతి ఒక్కరికి ఓటర్లకు ఆ విషయం తెలుసునని ఇప్పటికే కాంగ్రెస్ కు ఓటు వేసి ప్రజలంతా బాధపడుతున్నారని అన్నారు. ఈ చేరికల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు జుక్కల్ మాజీ ఎంపీపీ భర్త సూర్నార్ నీలు పటేల్, వాస్రే రమేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన లొంగన్ మాజీ సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



