Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరికొయ్యకు నిప్పు పెట్టొద్దు 

వరికొయ్యకు నిప్పు పెట్టొద్దు 

- Advertisement -

• మండల వ్యవసాయ అధికారి స్వామి నాయక్ 
నవతెలంగాణ -పెద్దవంగర
రైతులు వరికొయ్యకు నిప్పు పెట్టొద్దని మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వరికొయ్యకు నిప్పు పెడితే తలెత్తే అనర్ధాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పొగతో వాతావరణం కలుషితమౌతుందన్నారు. దీంతో శ్వాస కోశ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. రైతులు వరి కొయ్యకు కాల్చకుండా.. రోటోవేటర్ తో కలియ దున్నితే భూమిలో కలిసిపోసి ఎరువుగా మారుతుందని చెప్పారు. దీంతో పెద్దగా రసాయనిక ఎరువుల వాడకం కూడా తగ్గి, పంట దిగుబడి సైతం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రైతులు అశోక్ రెడ్డి, భూక్య బాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -