Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు 

జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు 

- Advertisement -

ముందస్తు అనుమతి లేని ర్యాలీలు, సభలకు పూర్తి నిషేధం
శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయం: జిల్లా ఎస్పీ సునీత రెడ్డి 
నవతెలంగాణ – వనపర్తి 

జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజా వాతావరణం ప్రశాంతంగా కొనసాగడం, అనవసర గుమికూడింపులు నివారించడం లక్ష్యంగా డిసెంబర్ 01 నుంచి డిసెంబర్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 నిబంధనలు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి జిల్లా పరిధిలో ఎవరైనా పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, భారీ స్థాయి సమావేశాలు నిర్వహించడం కఠినంగా నిషేధమని తెలిపారు. ప్రజా జీవనాన్ని అంతరాయం కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యకైనా చోటిలేదు” అని స్పష్టం చేశారు. అలాగే “30 పోలీస్ యాక్ట్” ఉల్లంఘనలకు చట్టంలో స్పష్టమైన శిక్షలు ఉన్నాయని తెలిపారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై ఎటువంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ప్రజల భద్రత కోసం పెట్టబడ్డాయని, అందరూ తప్పనిసరిగా పాటించాలి” అని హెచ్చరించారు. ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఏ కార్యక్రమం కావాలన్నా ముందుగానే దరఖాస్తు చేసి అనుమతి పొందండి. ప్రజల సహకారం వల్లనే శాంతిభద్రతలు నిలుస్తాయన్నారు. పోలీసుల చర్యలు ప్రజల రక్షణ కోసమేనని ఎస్పీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -