నవతెలంగాణ – బల్మూరు
మండలంలోని శ్రీ ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొండనాగుల విద్యార్థులు సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ ర్యాలీ నిర్వహించారు. కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలోనిర్వహించిన ర్యాలీ కార్యక్రమాల్లో కళాశాల ప్రిన్సిపాల్ పరంగి రవి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాప్తి కారణాలు, నివారణ చర్యలు, అవగాహన అవసరం గురించి తెలుసుకోవాలన్నారు. ఎయిడ్స్‌పై ఉన్న అపోహలను తొలగించడం మరియు సమాజంలో అవగాహన పెంపొందించడం యువత బాధ్యత అని పేర్కొన్నారు.
కొన్నాల గ్రామంలో డిగ్రీ కళాశాల నుండి పట్టణ ప్రధాన వీధుల ద్వారా ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎర్ర రిబ్బన్, ప్లకార్డులు, నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. అధ్యాపకులు డాక్టర్ డూప్ సింగ్,డాక్టర్ ఆర్ వెంకటయ్య,డాక్టర్ లక్ష్మ గౌడ్,అధ్యాపకేతర సిబ్బంది బి నరసింహులు చాంద్ బీ ఉన్నారు.



