Tuesday, December 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి సీపీఐ(ఎం)లోకి చేరికలు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి సీపీఐ(ఎం)లోకి చేరికలు

- Advertisement -

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ- మిర్యాలగూడ

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఆలగడప గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది సోమవారం సాయంత్రం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. పేదల పక్షాన నిరంతరం పోరాడే సీపీఐ(ఎం)కు పేద ప్రజలు అండగా నిలవాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఏనాడూ పదవుల కోసం ఆశించకుండా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. పేద ప్రజలు సీపీఐ(ఎం)కు అండగా నిలిచి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎర్రజెండానే ప్రత్యామ్నాయమని, యువకులు చైతన్యవంతులై సీపీఐ(ఎం)ను బలపరచాలని కోరారు.

సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరా: ఆలేటి బిందు
పేద ప్రజల కోసం పనిచేసే సీపీఐ(ఎం) సిద్ధాంతాలు నచ్చడంతో తనతో పాటు తన కుటుంబం, బంధువులు, గ్రామంలోని యువకులు, మహిళలు పార్టీ లో చేరినట్టు బీటెక్‌ విద్యార్థి ఆలేటి బిందు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం సీపీఐ(ఎం) చేస్తున్న ఉద్యమాలు ఎంతో గొప్పవనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందని చెప్పారు. ఆలగడప గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిగా తాను బరిలో నిలుస్తున్నా నని, ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఆమెతోపాటు పూసపాటి నాగేం దర్‌, పెద్దపంగ మహేష్‌, మంద మహేష్‌, కొత్తపల్లి ఎల్లయ్య, కొత్తపల్లి శ్రీను, తోకల కోటయ్య, యార సుందరి, ఇంద్రపల్లి మధు, మీసాల వినోద్‌, యారం నాగరాజు మరికొంతమంది చేరినట్టు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, పట్టిం రామచంద్రయ్య, పట్టేటి వెంకటయ్య, భాషబోయిన పాపయ్య, పి.వెంకటయ్య, గండెల శ్రీను, నాగేందర్‌, రామదాసు, వెంకటనారాయణ, సైదాచారి, ఇంద్రపల్లి సీమోను పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -