Tuesday, December 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంలేబర్‌ కోడ్‌ల రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలి

లేబర్‌ కోడ్‌ల రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలి

- Advertisement -

– హక్కుల సారధి.. పోరాటాల వారధి సీఐటీయూ : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– యూనియన్‌ హనుమకొండ జిల్లా రెండో మహాసభ ప్రారంభం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కోడ్‌లపై రైతు ఉద్యమ స్ఫూర్తితో యావత్‌ కార్మిక లోకం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి పీఆర్‌ రెడ్డి భవనంలో సోమవారం సీఐటీయూ జిల్లా రెండో మహాసభ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ ప్రసంగిస్తూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మరింత ఉధృతంగా పోరాటాలు చేయాలన్నారు. కార్మికులు యూనియన్లు పెట్టుకుని పోరాడే హక్కును తొలగిం చేందుకు ప్రయత్నిస్తూ యజమానులకు అవకాశం కల్పిస్తూ నాలుగు లేజర్‌ కోడ్‌ లను తీసుకొచ్చిందని విమర్శించారు. ఇది కార్మికుల శ్రమను దోచుకోవడమే నన్నారు. సింగరేణి, ఎల్‌ఐసీ, గనులు, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థ లను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరో పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలనే అనుసరిస్తోందని విమర్శించారు. మహాసభలో భవిష్యత్‌ ఉద్యమాలకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. మోడీ ప్రజ్యావతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. లేబర్‌కోడ్‌ల వల్ల పనిగంటలను 8నుంచి 12 గంట లకు పెంచుకునే అవకాశం యజమానులకు ఏర్పడిందని, కార్మికులు కనీస వేత నాలు అడిగేహక్కును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహాసభలో సీఐ టీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేష్‌, కాసు మాధవి, కూరపాటి రమేష్‌, జిల్లా అధ్యక్షులు టి.ఉప్పలయ్య, కార్యదర్శి రాగుల రమేష్‌, ఆఫీస్‌ బేరర్స్‌ జి.ప్రభాకర్‌ రెడ్డి, బొట్ల చక్రపాణి, మెట్టు రవి, పుల్లా అశోక్‌, సంఘాల మొగిలి, బొల్లారం సంపత్‌, కె.ఐలయ్య, రజిత, బి.మహేష్‌, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -