Tuesday, December 2, 2025
E-PAPER
Homeజాతీయంఐదేండ్లలో రెండు లక్షల కంపెనీల మూత

ఐదేండ్లలో రెండు లక్షల కంపెనీల మూత

- Advertisement -

లోక్‌సభలో కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాలశాఖమంత్రి హర్ష్‌ మల్హోత్రా వెల్లడి

న్యూఢిల్లీ : ఐదేండ్లలో దేశంలోని 2.04 లక్షలకు పైగా ప్రయివేటు కంపెనీలు మూతపడ్డాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం 2020-21 నుంచి 2024-25 మధ్య కాలంలో కంపెనీల చట్టం 2013 ప్రకారం.. విలీనం, మార్పిడి, రద్దు లేదా తొలగింపు కారణంగా 2,04,268 ప్రయివేటు కంపెనీలు మూసివేయబడ్డాయని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి హర్ష్‌ మల్హోత్రా తెలిపారు. సోమవారం మంత్రి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాచారం ప్రకారం.. 2024-25లో 20,365 కంపెనీలు మూతపడగా, 2023-24లో 21,181, 2022-23లో 83,452 చొప్పున ప్రయివేటు సంస్థలు మూతపడ్డాయి. 2021-22లో మరో 64,054 కంపెనీలు, 2020-21లో 15,216 కంపెనీలు మూసివేయబడ్డాయి.

డొల్ల కంపెనీకు నిర్వచనం లేదు
మూసివేయబడిన ఈ సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించారా? అనే ప్రశ్నకు సమాధానంగా.. ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి చెప్పారు. 2021-22తో ప్రారంభమయ్యే ఐదు ఆర్థిక సంవత్సరాలలో అధికారిక రికార్డుల నుంచి 1,85,350 కంపెనీలను కూడా తొలగించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జులై 16 వరకు 8,648 కంపెనీలను రద్దు చేశాయి. పలు కంపెనీలు చాలా కాలంగా కార్యకలాపాలు నిలిపివేసినట్లయితే లేదా నియంత్రణ అవసరాలను తీర్చిన తర్వాత స్వచ్ఛందంగా తొలగింపును కోరితే వాటిని రిజిస్ట్రీ నుంచి తొలగించవచ్చన్నారు. డొల్ల కంపెనీలు, మనీలాండరింగ్‌ కోసం వాటి దుర్వినియోగం గురించి ప్రశ్నలపై మంత్రి మాట్లాడుతూ.. ”షెల్‌ కంపెనీ” అనే పదానికి కంపెనీల చట్టం 2013లో నిర్వచనం లేదని పేర్కొన్నారు. 2021-22 నుంచి ఈ ఏడాది జులై 16 మధ్య కాలంలో 1,85,350 కంపెనీలు తొలగించబడ్డాయని మంత్రి చెప్పారు. కార్పొరేట్‌ పన్ను రేట్లలో భారీ తగ్గింపులతో సహా పెట్టుబడిని ప్రోత్సహించడానికి, వ్యాపారం చేయడం సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపట్టిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -