నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) విస్తరణ ఆర్డినెన్స్‌లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపాల్టీల చట్టాల సవరణ ఆర్డినెన్స్‌లకు సోమవారం ఆయన ఆమోదముద్ర వేశారు. జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లను విలీనం చేయాలని ఈనెల 25న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆర్డినెన్స్‌లను గవర్నర్ ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌లను గవర్నర్ ఆమోదించారు. జీహెచ్‌ఎంసీలో కలిపిన 27 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు సంబంధించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని నగర పాలక మున్సిపల్ కార్పొరేషన్లు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట, మున్సిపాల్టీలు దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, దుండిగల్, కొంపల్లి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్లు బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మున్సిపాల్టీలు పెద్ద అంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిభట్ల, జల్‌పల్లి, శంషాబాద్, మణికొండ, తుక్కుగూడ, నార్సింగి, సంగారెడ్డి జిల్లా పరిధిలోని మున్సిపాల్టీలు ఐడీఏ బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్ ఉన్నాయి.
జీహెచ్‌ఎంసీ విస్తరణ ఆర్డినెన్స్‌లకు గవర్నర్ ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



