ఇక అంతకు మించి ఏమీ చెప్పను : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా-వెనిజులా సంబంధాలు ఉద్రిక్తంగా మారిన వేళ యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి ఆసక్తికర విషయం వెల్లడైంది. ఇటీవల తాను వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో మాట్లాడినట్టు చెప్పారు. అయితే ఇరు దేశాల అధ్యక్షు లు ఏం మాట్లాడారు, దేని గురించి చర్చించారన్న విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. వాస్తవానికి ఈ విషయాన్ని తొలుత న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది. ఇద్దరి మధ్య అమెరి కాలో సమావేశం జరిపే అవకాశం గురించి మాట్లాడా రన్నది ఆ కథనం సారాంశం. అయితే మదురోతో మాట్లాడారా అని విలేకరు లు ప్రశ్నించి నప్పుడు స్పందించిన ట్రంప్.. ”దీనిపై నేను మాట్లాడ దలుచుకోలేదు.. కానీ నా సమాధానం ‘అవును”’ అని చెప్పారు. దీంతో మదురోతో మాట్లాడి న విషయాన్ని ఆయన ధృవీకరించారు. ఇది ఫోన్ కాల్ మాత్రమేననీ, అయితే అది మంచిగా జరిగిందా, చెడ్డగా జరిగిందా అన్నది మాత్రం తాను చెప్పనని ట్రంప్ తెలిపారు. వెనిజులా పై అమెరికా ఒత్తిడి పెరుగుతున్న ప్రస్తుత సమ యంలో ఈ కాల్ వెలుగులోకి రావటం గమనార్హం.



