– రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఘటన
– ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్
నవతెలంగాణ- కొత్తూరు
ఒకే కంపెనీలో పని చేస్తున్న యువతీయువకుడు.. యువతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించి సీఐ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన నవనీత్ దత్త నాలుగేండ్ల కిందట తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కొత్తూరుకు వచ్చి లారీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమార్తె అనామికదత్త(20) రవి ఫుడ్స్ పరిశ్రమలో పనిచేసేది. అదే పరిశ్రమలో ధనుంజయ పసి(25) అనే వ్యక్తి పని చేసేవాడు. అక్కడే వీరికి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అనామిక మూడ్రోజులుగా పనికి వెళ్లడం లేదు. సోమవారం మధ్యాహ్నం తండ్రి నవనీత్ దత్త చిన్న కూతురుతో కలిసి బయటికి వెళ్లాడు. అప్పుడు ఇంట్లో అనామిక ఒక్కతే ఉంది. అనామిక పనిలోకి రాకపోవడంతో ధనుంజయ పసి వీరి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ ఆత్మహత్య చేసుకున్నారు. నవనీత్ దత్త ఇంటికి వచ్చి చూడగా.. తన కూతురుతోపాటు మరో యువకుడు ఉరేసుకుని కనిపించారు. దాంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ పరిశీలించారు. ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా..? లేక యువతిని చంపి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా ఇద్దరినీ మరెవరైనా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే విషయం విచారణలో తేలుతుందని ఏసీపీ తెలిపారు. మృతురాలి తండ్రి నవనీత్ దత్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువతీ యువకుడి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



