Tuesday, December 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగడువులోగా పనులను పూర్తి చేయాలి

గడువులోగా పనులను పూర్తి చేయాలి

- Advertisement -

– భూసేకరణ అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలి
– మార్చి 2026 నాటికి రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– మున్నేరు నదిపై రిటైనింగ్‌ వాల్‌, కేబుల్‌ బ్రిడ్జి, ఖమ్మం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులపై సమీక్ష
నవతెలంగాణ-గాంధీ చౌక్‌

అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశ మందిరంలో మున్నేరు నదిపై రిటైనింగ్‌ వాల్‌, కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం, ఖమ్మం అండర్‌ గ్రౌండ్‌ డ్రయినేజీ నిర్మాణ పనులపై నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, ఇతర అధికారులతో కలిసి మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రస్తుతం వర్కింగ్‌ సీజన్‌ నడుస్తుందని, పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశిం చారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి బైపాస్‌ రోడ్డు నుంచి కేబుల్‌ బ్రిడ్జి వరకు మొదటి ప్రాధాన్యతగా, కేబుల్‌ బ్రిడ్జి నుంచి ప్రకాష్‌ నగర్‌ బ్రిడ్జి వరకు రెండో ప్రాధాన్యతగా పెండింగ్‌ భూసేకరణ త్వరగా క్లియర్‌ చేయాలని చెప్పారు. భూముల బదలాయింపు కోసం అడ్వాన్స్‌ పోజిషన్‌ వెంటనే అందించాలని రాష్ట్ర స్థాయి అధికారులను మంత్రి చరవాణిలో ఆదేశిం చారు. మార్చి 2026 నాటికి మున్నేరు నది రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు పూర్తి చేయాలని, ప్రతి నెల ఎంత మేరకు పనులు పూర్తవుతాయో నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని, సంబంధిత కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు, అధికారులకు సూచించారు. నూతన టెక్నాలజీతో కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు జరగాలని, హైదరాబాద్‌ దుర్గం చెరువు, కరీంనగర్‌ మానేరు నదిపై గతంలో కేబుల్‌ బ్రిడ్జిలు ఉన్నాయని, రాష్ట్రంలో 3వ కేబుల్‌ బ్రిడ్జి ఖమ్మం నగరంలో నిర్మాణం అవుతుందని, దీనికి అవసరమైన పవర్‌ లైన్స్‌, విద్యుత్‌ స్తంభాల తరలింపు పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశిం చారు. ఖమ్మం నగరం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఎస్‌టిపి నిర్మాణానికి అవసరమైన భూసే కరణ పనులను క్షేత్ర స్థాయిలో ప్రజలను ఒప్పించి పూర్తి చేసి సంబంధిత ఏజేన్సీలకు త్వరగా భూమి అప్పగిం చాలని అన్నారు. ఈ సమావేశంలో పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఇ రంజిత్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఇ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ యాకోబు, విద్యుత్‌ ఎస్‌ఇ, తహసీల్దార్‌లు రాంప్రసాద్‌, సైదులు, ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -