కార్మిక శాఖ మంత్రి జి.వివేక్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిగ్ కార్మికుల రక్షణ చట్టాన్ని రూపొందించేందుకు, వారికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు మరింత అధ్యయనం చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ కోరారు. గిగ్ కార్మికుల చట్ట రూపకల్పనకు విధాన సిఫార్సులతో కూడిన పత్రాన్ని, నివేదికను కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి సీఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నీలం రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ టి. సురేష్ బాబు సోమవారం హైదరాబాద్‌లో అందజేశారు.
దేశంలోనే తొలిసారిగా గిగ్ ఎకనామీపై నీలం రాజశేఖర్‌రెడ్డి పరిశోదన కేంద్రం సెమినార్ నిర్వహించామనీ, అందులో పశ్చిమ బెంగాల్ కార్మిక శాఖ మాజీ కమిషనర్ డాక్టర్ కింగ్‌షుక్ సర్కార్, గిగ్ కార్మికుల ఫెడరేషన్ నాయకులు షేక్ సలాహుద్దీన్, ఆర్థిక సామాజిక సమస్యల విశ్లేషకులు డాక్టర్ పీఎస్‌ఎం.రావు, ఏఐటీయూసీ నేత బి.వెంకటేశం, ఉబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల గిగ్ కార్మికులు పాల్గొన్నారని మంత్రికి తెలిపారు. అందులో గిగ్ కార్మికుల సవాళ్లు, అవకాశాలు, విధాన పరిష్కారాలపై విస్తృత చర్చ జరిగిందనీ, దాని ఆధారంగా నివేదిక రూపొందించామని వివరించారు. ఆ నివేదికను మంత్రి వివేక్ వెంకట్‌స్వామికి సీపీఐ నేతలు అందజేశారు. గిగ్ కార్మికులపై మరింత అధ్యయనం చేసి వారి సంక్షేమం కోసం తీసుకోవాల్సిన అంశాలపై మరిన్ని సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి కోరారు.
గిగ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేసి సూచనలివ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



