Tuesday, December 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమద్యంలో మూత్రం కలిపి తాగాలంటూ హింసించారు

మద్యంలో మూత్రం కలిపి తాగాలంటూ హింసించారు

- Advertisement -

– నామినేషన్‌ వేయొద్దంటూ నా భార్యను కత్తులతో బెదిరించారు
– బాధితుడు మామిడి యాదగిరి
నవతెలంగాణ-తిప్పర్తి

‘మూత్రం కలిపిన మద్యం తాగాలంటూ.. నీ భార్య సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేయొద్దంటూ నన్ను కత్తులతో బెదిరించారు’ అని కిడ్నాప్‌ బాధితుడు మామిడి యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో ఈ నెల 28న కిడ్నాప్‌కు గురైన సర్పంచ్‌ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త మామిడి యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 28న అధికార పార్టీ నాయకుడు నలుగురు వ్యక్తులతో కలిసి నన్ను కిడ్నాప్‌ చేయించి చిత్రహింసలకు గురిచేశాడు. మూత్రం కలిపిన మద్యాన్ని తాగాలంటూ.. ”మీ భార్యని నామినేషన్‌ వేయకుండా ఆపాలంటూ” కత్తులు పట్టుకుని బెదిరిస్తూ ఫోన్‌ చేయించి చిత్రహింసలకు గురి చేశారు. అదే రోజు పోలీస్‌ స్టేషన్లో తెల్ల పేపర్‌ మీద సంతకం పెట్టించుకొని వారికి నచ్చినట్టుగా కంప్లైంట్‌ రాసుకొని వదిలేశాడు. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సహకారంతో తాను పోలీసుస్టేషన్‌కు వెళ్లి కిడ్నాపర్లపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

బీసీలను అణచివేతకు గురిచేస్తున్న మంత్రి కోమటిరెడ్డి : తీన్మార్‌ మల్లన్న
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన అనుచరులతో కిడ్నాప్‌ చేయించి.. బీసీలు నామినేషన్‌ వేయకుండా అణచివేతకు గురిచేయడం సరికాదని రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్‌ మల్లన్న అన్నారు. ఎల్లమ్మగూడెంలో మామిడి యాదగిరి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిగజారి రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీసీలను అణగదొక్కేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు వట్టె జానయ్య, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -