Tuesday, December 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందూర ప్రాంతాలకు సింగిల్‌ డ్రైవర్‌గా వెళ్లాలంటే ఇబ్బంది

దూర ప్రాంతాలకు సింగిల్‌ డ్రైవర్‌గా వెళ్లాలంటే ఇబ్బంది

- Advertisement -

– అసిస్టెంట్‌ మేనేజర్‌ ఇబ్బందులు పెడుతున్నారు
– సిద్దిపేటలో డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల నిరసన
నవతెలంగాణ-సిద్ధిపేట

సింగల్‌ డ్రైవర్‌తో దూర ప్రాంతాలకు బస్సులు నడపాలని, కంటిన్యూగా డ్యూటీలు చేయాలంటూ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆర్టీసీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అసిస్టెంట్‌ మేనేజర్‌, డిపో మేనేజర్‌ వేధింపులను నిరసిస్తూ సిద్దిపేట బస్‌డిపో ఎదుట సోమవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నూల్‌, బీదర్‌, సోలాపూర్‌ వంటి దూర ప్రాంతాలకు సింగిల్‌ డ్రైవర్‌తోనే బస్సులు నడపాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే సెలవు అడిగితే చనిపోయిన వారి ఫొటో పెట్టాలని.. అప్పుడే సెలవు మంజూరు చేస్తానని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. దూర ప్రాంతాలకు ఒక్కరే డ్రైవింగ్‌ చేస్తూ వెళ్లి రావాలంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కంటిన్యూగా నిద్రలేకుండా డ్యూటీలు చేయడం వల్ల అలసిపోయి, అనారోగ్యాలకు గురవుతున్నామని అన్నారు. గతంలో డ్యూటీలతో ఇబ్బందులు ఎదురై డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. సింగిల్‌ డ్రైవర్‌ కాకుండా డబుల్‌ డ్రైవర్‌తో డ్యూటీ వేయాలని, కంటిన్యూ డ్యూటీలు కాకుండా డే బై డే వేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -