బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా వ్యతిరేకించడమే మీ పనా..?’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ప్రశ్నించారు. 2022లో ఆనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం లీజ్ లాండ్‌ను ఫ్రీ హోల్డ్ చేస్తే బీజేపీ ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ…తమ ప్రభుత్వ పాలసీలకు సంబంధించి ఆ రెండు పార్టీలు అవాకులు చెవాకులు పేలుతున్నాయని విమర్శించారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగి పాఠశాలలకు సెలవులు ఇస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు రావొద్దనేదే తమ ఆలోచనని పేర్కొన్నారు. కానీ హైదరాబాద్‌కు ఆ దుస్థితి రావాలనే దుర్బుద్దితో బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఉన్నాయని దుయ్యబట్టారు. హిల్ట్ పాలసీ జీవోలో సొంత భూములపై కన్జర్వేషన్ ఫీజు విధించాలనే అంశాన్ని చేర్చామని గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వ భూములను దారాదత్తం చేసిందే బీఆర్‌ఎస్ అని విమర్శించారు. కేసీఆర్ హయాంలో యదేచ్ఛగా టైటిల్స్ మార్చారని దుయ్యబట్టారు. సిరీస్ అనే ఫార్మా కంపెనీకి సంబంధించిన వంద ఎకరాల భూమిని గత ప్రభుత్వం కన్జర్వేషన్ చేసింది, అప్పుడు బీఆర్‌ఎస్‌కు నిబంధనలు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. అందుకు భిన్నంగా తాము నిరూపయోగంగా ఉన్న పరిశ్రమల భూములను ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ భూముల విషయంలో తాము ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. ఇండిస్టీల వద్దనున్న భూముల గురించే పాలసీ రూపొందించామని వివరించారు. బీఆర్‌ఎస్ అలసత్వం వల్లే హైదరాబాద్ పరిసరాల్లో కాలుష్యకారక పరిశ్రమలు పెరిగాయని శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా విమర్శించారు.
మా నిర్ణయాలను వ్యతిరేకించటమే మీ పనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



