Tuesday, December 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెండింగ్‌ బిల్లులు నెలకు రూ.1,500 చెల్లించాలి

పెండింగ్‌ బిల్లులు నెలకు రూ.1,500 చెల్లించాలి

- Advertisement -

9లోపు ఆరోగ్య కార్డులివ్వాలి
డీఏ విడుదల చేయాలి
టెట్‌పై పార్లమెంటులో చట్ట సవరణ కోసం తీర్మానం పంపాలి : ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులకు సంబంధించి నెలకు రూ.700 కోట్లు సరిపోవడం లేదనీ, రూ.1,500 కోట్లు చెల్లించాలని ఉద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈనెల తొమ్మిదిలోపు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని కోరింది. ఇచ్చిన హామీ మేరకు డీఏను విడుదల చేయాలని తెలిపింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నుంచి ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులకు మినహాయింపునిచ్చేందుకు పార్లమెంటులో చట్ట సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కోరింది. సోమవారం తెలంగాణ ఉద్యోగ జేఏసీ సమావేశాన్ని హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్‌లో నిర్వహించారు. అనంతరం మీడియాతో ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సంబరాల్లో ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఈనెల తొమ్మిది నాటికి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

జూన్‌ 13న విడుదల చేసిన డీఏ ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. ఆరోగ్య కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటిని తక్షణమే ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్‌ ఉత్తీర్ణత కావాలన్న నిబంధన నుంచి మినహాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపాలని సూచించారు. ఈనెల తొమ్మిదిలోగా సమస్యలను పరిషఇంచి ప్రభుత్వం-ఉద్యోగుల మధ్య సంబంధాన్ని మరింత బలపడేలా చేయాలన్నారు. ఈ కార్యక్రమములో ఉద్యోగ జేఏసీ నేతలు పుల్గం దామోదర్‌రెడ్డి, ఎ వెంకట్‌, జి సదానందంగౌడ్‌, వంగ రవీందర్‌రెడ్డి, పి మధుసూదన్‌ రెడ్డి, ముజీబ్‌ హుస్సేన్‌, ఎ సత్యనారాయణ, సత్యనారాయణ గౌడ్‌, తిప్పర్తి యాదయ్య, టి లింగారెడ్డి, కస్తూరి వెంకటేశ్వర్లు, దాస్య నాయక్‌, అనిల్‌కుమార్‌, బి శ్యామ్‌, కృష్ణయాదవ్‌, రామారావు, శ్రీకాంత్‌, కటకం రమేష్‌, షౌకత్‌ హుస్సేన్‌, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -