Tuesday, December 2, 2025
E-PAPER
Homeక్రైమ్పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు..ఇద్దరు మృతి

పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు..ఇద్దరు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి ఆరుగురు పాదచారులను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని పుణె లో గల పింపిరి-చించ్వాడ్ ప్రాంతంలో సోమవారం రాత్రి సమయంలో చోటు చేసుకుంది. వాకడ్ వంతెన వైపు వెళ్తున్న బస్సు షావ్జీ చౌక్ సమీపంలో ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే, పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుల బృందం ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు నిర్వహించారు.

ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ప్రాథమిక విచారణలో కీలక అంశాన్ని వెల్లడించారు. బస్సు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు వాకడ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ కురాడే తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన ధృవీకరించారు. మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -