నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్లు వస్తోన్న వార్తలను ఆ దేశ ప్రభుత్వం ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ఇమ్రాన్‌ఖాన్‌ను చూసేందుకు ఆయన కుటుంబసభ్యులను అనుమతించకపోవడం, అతని ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మంగళవారం మాజీ ప్రధానికి అనుకూలంగా భారీ ర్యాలీకి రంగం సిద్ధం చేశారు. ఆందోళనకారులను అడ్డుకొనేందుకు ప్రభుత్వం రావల్పిండిలో సెక్షన్ 144 విధించింది. ప్రజా భద్రత దృష్ట్యా బుధవారం వరకు అన్ని బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని గ్రూపులు రావల్పిండిలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ వెల్లడించింది.
ఇమ్రాన్ ఖాన్ మృతి వార్తలు..దేశవ్యాప్తంగా ఆందోళనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



