Tuesday, December 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో మద్యం మత్తులో యువతి హల్ చల్..

హైదరాబాద్‌లో మద్యం మత్తులో యువతి హల్ చల్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో మద్యం మత్తులో యువతి హల్ చల్ చేసింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ చౌరస్తాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాగినమైకంలో రోడ్డుపైకి వచ్చిన యువతి వాహనదారులు వెల్లకుండా రోడ్డుకు అడ్డంగా నిలబడింది. వాహనాలను అడ్డుకుంటూ వారికి చుక్కలు చూపించింది. నచ్చజెప్పేందుకు వెళ్లిన పోలీస్ అధికారినే వెనక్కి నెడుతూ రెచ్చిపోయింది. వీళ్లు ఆంధ్రావాళ్లు కాదని తను ఆంధ్రా వెళ్లాలని వ్యాఖ్యానించింది.

వీడియో తీస్తున్నవారిపై సైతం ఆగ్రహం చేసింది. చివరికి ఓ ఆటోను ఆపి యువతిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు. వామ్మో ఏ బ్రాండ్ తాగావ్ అక్కా అంత‌లా ఎక్కింది అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా మరో నెటిజన్ ఒక‌ప్పుడు అబ్బాయిలు తాగి రోడ్ల‌పై గొడ‌వలు పెట్టుకుంటే ఇప్పుడు అమ్మాయిలే తాగి పోలీసుల‌తో న్యూసెన్స్ చేస్తున్నారంటూ కామెంట్ చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -