Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రుద్రారం బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రాజీనామా.!

రుద్రారం బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రాజీనామా.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామ మాజీ సర్పంచ్ పగడాల ధనలక్ష్మి భర్త పగడాల నారాయణ ఒంటెద్దు పోకడతో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడుగా,పార్టీ సబ్యత్వానికి రాజీనామా చేసినట్లుగా గుడికందుల ప్రభాకర్ మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో సమావేశంలో రాజీనామా చేసిన పత్రాన్ని చూపిస్తూ మాట్లాడారు తాను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గెలుపు కోసం, గ్రామశాఖ అధ్యక్షుడు మూడు సంవత్సరాలుగా పార్టీ బలోపేతం కోసం సొంత డబ్బులు ఖర్చుపెట్టుకొని తిరిగితే తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. నారాయణ ఒంటెద్దు పోకడతో పార్టీకి నష్టం జరుగుతుందని పుట్ట దృష్టికి పలుమార్లు తీసుకపోయిన పట్టించుకోలేదని ఆరోపించారు. బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని నియమించడంలో తనకు సంప్రదించకుండానే నారాయణ ఒంటెద్దు పోకడకు పోవడంతో తాను రాజీనామా చేసినట్లుగా వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -