నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కళాశాల ప్రిన్సిపల్ గంగారాంకు విద్యార్థులు వినపత్రం అందజేశారు. ఈ సందర్భం గా ఏబీవీపీ గాంధారి మండల కన్వీనర్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. మా కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నాం స్కవేంజర్ లేక బత్రుమ్స్ అపరిశుభ్రంగా ఉండటం వల్ల విద్యార్థులు అందరం బయటకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. అదే విధంగా తరగతి గదులు కూడా శుభ్రంగా లేక పోవడం, త్రాగునీరు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే సమస్యలనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కళాశాల ప్రిన్సిపల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాoలో కళాశాల కార్యదర్శి సందీప్ ,వినోద్,సౌమ్య,స్నేహ,భవాని తదితరులు పాల్గోన్నారు.
కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రిన్సిపాల్ కు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



