Tuesday, December 2, 2025
E-PAPER
Homeజాతీయంపార్లమెంట్ ఎదుట విప‌క్షాలు ధ‌ర్నా

పార్లమెంట్ ఎదుట విప‌క్షాలు ధ‌ర్నా

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: పార్లమెంట్‌లో వెంటనే ‘SIR’పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్ భవన్ ఎదుట ప్రతిపక్ష సభ్యులంతా ప్లకార్డులు పట్టుకుని ‘సర్’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, విపక్ష ఎంపీలంతా నిరసనల్లో పాల్గొన్నారు. తక్షణమే ‘SIR’ను నిలిపివేయాలని కోరారు.

కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ‘SIR’ చేపట్టింది. ఈ ప్రత్యేక ఓటర్ సర్వే ద్వారా అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల సంఘం పని చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సర్వే చేపట్టింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ఈ అంశంపైనే విపక్షాలు ఆందోళన చేశాయి. తాజాగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో కూడా సర్వే జరుగుతోంది. సర్వే నిలిపివేయాలని.. ఒత్తిడి భరించలేక బీఎల్‌వోలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -