Tuesday, December 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఓటరు లిస్టులో పేర్లు మిస్సింగ్.. హైకోర్టులో పిటిషన్

ఓటరు లిస్టులో పేర్లు మిస్సింగ్.. హైకోర్టులో పిటిషన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోన్న వేళ రాష్ట్రంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓటరు లిస్టులో తమ పేర్లు రాలేదంటూ నల్గొండ జిల్లా దామరచర్ల గ్రామ పంచాయతీకి చెందిన ఓటరు బంటు రేణుక రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె పిటిషన్‌పై మరో రెండు రోజుల్లో విచారణ జరగనుంది. అయితే, మహబూబ్ నగర్ డీఎస్పీకి కూతురు అయిన రేణుక ఈ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకుంది. తీరా చూస్తే ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు సూచనాప్రాయంగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని చెప్పినట్లుగా సమాచారం. కాగా, ఓటరు జాబితా నుంచి అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా ఓటును తొలగిస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-226 కింద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అధికారం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -