Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోస్టల్ బ్యాలెట్ ఓటుపై భద్రత ఎక్కడ..

పోస్టల్ బ్యాలెట్ ఓటుపై భద్రత ఎక్కడ..

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్నికల విధులలో నియమించబడ్డాడు. విధులలో భాగంగా తనకు ఉన్న ఓటు హక్కు ను పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోగా ఆ ఓటు పై భద్రత లేకుండా పోయిందని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన చెందారు. గ్రామాలలోని కొన్ని వార్డుల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించే ప్రభుత్వ ఉద్యోగులు చాలా తక్కువగా కొన్నిసార్లు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉండడం వలన ఓటు రహస్యం పరోక్షంగా బయటకి పొక్కుతోందని ఇలానే జరిగితే కౌంటింగ్ సమయంలో వ్యక్తిగత ఓటు ఏదో గుర్తించబడే అవకాశం ఉంటుందని ప్రభుత్వ ఉపాధ్యాయులు భయాందోళనలో ఉన్నారు.

ఈ పరిస్థితి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో సందేహం,భయం కలిగిస్తోంది. రహస్య ఓటు హక్కు అనే మా మౌలిక హక్కు ను పూర్తిగా రక్షించడం లేదని అంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు పూర్తిగా రహస్యంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలనీ, ముఖ్యంగా చాలా తక్కువ మంది ఉద్యోగులు ఉన్న వార్డుల్లో వ్యక్తిగత ఓట్లను గుర్తించకుండా ఉండేందుకు పోస్టల్ బ్యాలెట్లను ఉన్నత స్థాయిలో క్లబ్ చేసే ప్రత్యామ్నాయ విధానాలను పరిశీలించాలనీ తెలుపుతున్నారు. కౌంటింగ్ సిబ్బందికి రహస్యత్వం కచ్చితంగా పాటించాలనే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలనీ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రహస్య ఓటు హక్కును కాపాడి, ఎన్నికల విధుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -