- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్‌సైన్స్ వర్సిటీని ఇక్కడే ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. కొత్తగూడెంలో వర్సిటీని ప్రారంభించిన ఆయన.. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ సాకారం చేసిన మన్మోహన్ సింగ్ పేరును దేశంలో ఉన్న ఏకైక ఎర్త్‌సైన్స్ వర్సిటీకి పెట్టుకోవడం గర్వకారణమన్నారు. కీలకమైన మంత్రి పదవులు ఖమ్మం జిల్లా నేతల దగ్గరే ఉన్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధిపథంలో నడిపే బాధ్యత తనదేనన్నారు.
- Advertisement -



