Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుడుంబా స్థావరాలపై దాడులు..

గుడుంబా స్థావరాలపై దాడులు..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖ వరంగల్ డిప్యూటీ కమీషనర్ అంజన్ రావు,భూపాలపల్లి జిల్లా ప్రోహిబిషన్, ఎక్సజ్ శాఖ బివి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మహాముత్తారం మండలంలో కోర్లకుంట, మాదారం, దొబ్బలపడు గ్రామాల్లో నాటు సారాయి స్థావారాలపై విస్తృతంగా దాడులు నిర్వహించినట్టుగా కటేం ఎస్ఐ కిష్టయ్య తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు నాటుసారాయి తయారు దారులపై నమోదు చేసినట్లుగా తెలిపారు. ఇందులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్  చేసి,20 లీటర్ల నాటు సారాయి,20 కేజీల చక్కరను స్వాధీనం చేసుకుని, 900  లీటర్ల చక్కర పానకంను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. అనంతరం నాటు సారాయితో జరిగే అనర్ధాలపై అవగాహన కలిగించి, వాటిని తయారు చేసినా, కలిగి వున్నా, రవాణా చేసిన, అమ్మిన చట్టం ప్రకారం కఠిన చర్యలు వుంటాయని తెలిపారు. ఈ దాడులల్లో ఎక్సైజ్ శాఖ హెడ్ కాన్స్టేబుల్ రాంచందర్,కాన్స్టేబుల్ వెంకట రాజు,విమల,రామకృష్ణ  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -