Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శుభ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే తోట

శుభ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లోని మహారాష్ట్ర దెగులూర్ పట్టణంలో జరిగిన పెండ్లి శుభ కార్యక్రమానికి అదేవిధంగా మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో జరిగిన పెండ్లి కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు హాజరై నూతన వధూవరులకు అక్షంతలు వేసి ఆశీర్వదించారు. పెండ్లి శుభ కార్యక్రమాలు హాజరైన ఎమ్మెల్యేకు మద్నూర్ గురు ఫంక్షన్ హాల్ లో మండలంలోని గోజేగావ్ మాజీ సర్పంచ్ అనిత ఇరవంత్ దేశముఖ్ ఎమ్మెల్యేకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే తో పాటు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ రామ్ పటేల్ కు శాలువతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివాజీరాథోడ్ పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -