Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆంగ్లభాషపై టాలెంట్ పరీక్ష

ఆంగ్లభాషపై టాలెంట్ పరీక్ష

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆంగ్ల భాషలో మంచి మేలుకువలు నేర్చుకుని నైపుణ్యం పెంచుకోవాలని మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చేతన కుమారి తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్లభాష ఉపాధ్యాయ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మండల స్థాయి ఆంగ్ల ప్రతిభ పరీక్షలలో వివిధ పోటీలు ప్రభుత్వ పాఠశాలలు ,కేజీబీవీ, మోడల్ స్కూల్ స్థాయిలలో జూనియర్ ,సీనియర్ విభాగంలో నిర్వహించినారు. ఈ సందర్భంగా విజేతలకు సర్టిఫికెట్లు సైతం ప్రధానం చేసినారు .మండల స్థాయిలో విజేతలకు ఈనెల 18న జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, రూరల్ ప్రధాన కార్యదర్శి సంఘం అశోక్, దత్తాద్రి, శోభా, శ్రీలత, సిగ్న,  సుమలత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -