- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభం కాగా నేటితో(మంగళవారం) గడువు ముగిసింది. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 12 వేలకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 14న రెండో విడత పోలింగ్ జరగనుంది. అటు తొలి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ నెల 11న తొలి విడత పోలింగ్ జరగనుంది.
- Advertisement -



