నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాలయం పరిధిలోని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల 2023 బ్యాచ్,మూడో సంవత్సరం వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న 102 మంది విద్యార్థులు ఈ నెల 23 వ తేదీ నుండి డిసెంబర్ 2 వ తేదీ వరకు పదిరోజులు పాటు చేపట్టిన దక్షిణభారత విజ్ఞాన యాత్రలో భాగంగా 10 వ రోజు మంగళవారం పాండిచ్చేరి లోని భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈ(సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ టెక్నాలజీ సెంటర్ ను సందర్శన సందర్శించారు. ఇందులో ఏర్పాటు చేసిన కృత్రిమ మేధస్సుతో డిజిటల్ కల్టివేషన్(సాంకేతిక సాగు) అనే అంశంపై ఒక రోజు వర్క్‌షాప్ కు విద్యార్థులు హాజరయ్యారు. ఈ విజ్ఞాన యాత్రకు టూర్ లీడర్లుగా స్థానిక వ్యవసాయ కళాశాల బోధనా సిబ్బంది డాక్టర్ టీ. శ్రావణ కుమార్, డాక్టర్ కే.శిరీష్, డాక్టర్ శ్రీ జన్,డి. స్రవంతిలు వ్యవహరిస్తున్నారు.
పాండిచ్చేరిలో పర్యటిస్తున్న వ్యవసాయ విద్యార్ధులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



