‘టీజే టిల్లు’ తో మంచి విజయాన్ని అందుకున్న రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘అనుమానపక్షి’. రాగ్ మయూర్ హీరోగా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. మెరిన్ ఫిలిప్ కథానాయిక. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ ఇప్పుడు రాగ్ మయూర్ పాత్ర ద్వారా సినిమా రిలీజ్ టైమ్‌ని వెల్లడించే ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో రాగ్ మయూర్ అనుమాన పక్షిగా పరిచయం అయ్యారు. అతిగా ఆలోచించడం, అతిగా జాగ్రత్తగా ఉండే స్వభావంతో తన చుట్టూ ఉన్నవారిని గందరగోళపరిచే విచిత్రమైన క్యారెక్టర్ ఆకట్టుకుంది. ప్రోమోతో పాటు, చిత్ర ప్రచార కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయని, ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుందని తెలియజేశారు. ఖచ్చితమైన తేదీని త్వరలో అనౌన్స్ చేస్తారు.
బలమైన పాత్రలతో అలరించే దర్శకుడు విమల్ కృష్ణ ప్రత్యేకంగా రాగ్ మయూర్ కోసం రూపొందించిన యూనిక్ క్యారెక్టర్‌తో వస్తున్నారు. అతని సిగేచర్ స్టైల్, హాస్యభరితమైన కథ ప్రమోషనల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ‘సినిమా అద్భుతంగా వచ్చింది. ఇదొక క్యారెక్టర్ బేస్డ్ సినిమా. ఇందులో మా హీరో క్యారెక్టర్ అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇప్పటివరకు రానటువంటి కాన్సెప్ట్‌తో దర్శకుడు విమల్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని మేకర్స్ తెలిపారు. ప్రిన్స్ సిసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి రచన- దర్శకత్వం: విమల్ కృష్ణ, నిర్మాతలు: రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్, సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ, క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రావణ్ కుప్పిలి, డిఓపి: సునీల్ కుమార్ నామా, ఆర్ట్ డైరెక్టర్: మూర్తి, ఎడిటర్: అభినవ్ కునపరెడ్డి.
సిసలైన ‘అనుమానపక్షి’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



