జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్‌లో ‘అద్భుతం, టెనంట్’ వంటి చిత్రాలను నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘గోట్’. క్రికెట్ నేపథ్యంలోనే కామెడీ ప్రధాన అంశంగా రూపొందిన ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటించారు. మంగళవారం టీజర్‌ని రిలీజ్ చేసిన సందర్భంగా ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ,”అద్భుతం’ సినిమా మాదిరిగానే ఈ సినిమాని కూడా మేము చాలా బాధ్యతాయుతంగా తీసాం. ఫ్యాషన్‌తోనే సినిమా చేశాను. టీజర్‌లో కామెడీ, మాస్, యాక్షన్ మీరు చూశారు. ఈ సినిమా ఒక ఫుల్‌మీల్స్ లాగా ఎంజాయ్ చేసే సినిమా. అలాగే సొసైటీలో ఉన్న ఒక సమస్యను కూడా ఇందులో అడ్రస్ చేశాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తారని నమ్మకం ఉంది. రవీంద్ర రెడ్డి మాకు చాలా సపోర్ట్ చేశారు.
మా హీరోయిన్ దివ్యభారతి ఈ సినిమా ఒప్పుకోడమే చాలా ఆనందాన్నిచ్చింది. నితిన్ ప్రసన్న ఇందులో మెయిన్ విలన్‌గా చేశారు. ఆయన మాకు దొరకడం గాడ్ గిఫ్ట్. లియన్ జేమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం మణిశర్మ పనిచేస్తున్నారు. ఆయన సపోర్టు మర్చిపోలేను. పోస్ట్ ప్రొడక్షన్ అద్భుతంగా వచ్చింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’ అని తెలిపారు.
‘ఈ సినిమాని మాస్ ఎంటర్టైనర్‌గా తీశాం. చంద్రశేఖర్ రెడ్డి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని కో ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి చెప్పారు. హీరోయిన్ దివ్యభారతి మాట్లాడుతూ,’తమిళంలో నాకు ‘బ్యాచిలర్’ ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో, తెలుగులో ఈ సినిమా అంతా పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.
అందరికీ నచ్చేలా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



