Wednesday, December 3, 2025
E-PAPER
Homeజాతీయంబ్రహ్మౌస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్‌

బ్రహ్మౌస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్‌

- Advertisement -

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: బంగాళాఖాతం వద్ద నుంచి బ్రహ్మౌస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్‌ అయ్యిందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దక్షిణ కమాండ్‌లోని బ్రహ్మౌస్‌ యూనిట్‌,
ట్రై-సర్వీసెస్‌ అండమాన్‌, నికోబార్‌ కమాండ్‌ యొక్క అంశాలతో కూడిన కచ్చితమైన సమన్వయ ప్రయత్నం ద్వారా విజయవంతమైందని పేర్కొంది. అధునాతన మార్గదర్శకత్వం , నియంత్రణ వ్యవస్థలతో అమర్చబడిన ఈ క్షిపణి అధిక-వేగ విమాన స్థిరత్వం, టెర్మినల్‌ కచ్చితత్వాన్ని ప్రదర్శించిందని, దాని నిర్దేశించిన లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించిందని వివరించింది. యుద్ధభూమి సవాళ్లను ఎదుర్కోవడానికి రియల్‌-టైమ్‌ ప్రెసిషన్‌ స్ట్రైక్‌ మిషన్లను చేపట్టే సామర్థ్యాన్ని పునరుద్ఘాటించింది. ఈ సందర్భంగా దక్షిణ కమాండ్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ధీరజ్‌ సేథ్‌ విజయవంతమైన పోరాట ప్రయోగాన్ని ప్రశంసించారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -