అఖిల భారత బాలల హక్కుల పరిరక్షణ వేదిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారు బాల్యానికి భరోసానివ్వాలని అఖిల భారత బాలల హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ వేదిక జాతీయ అధ్యక్షులు ఆర్.వెంకట్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడం, బాల్య వివాహాలు జరగకుండా చూడటం, బాల కార్మికులు లేకుండా చూడటంతో పాటు వారికి నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. రాజ్యాంగంలో 18 సంవత్సరాలలోపు వయస్సు బాలలకు కల్పించిన హక్కులను కాపాడటం గ్రామ పంచాయతీల కర్తవ్యంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. గెలిచిన వారు పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య ఉపకేంద్రాలు సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించి, సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ప్రయత్నించాలన్నారు. పిల్లల స్థాయి నిర్ధారణ (బేస్ లైన్ సర్వే)పై సమీక్షించి ఆయా తరగతుల వారీగా సామర్థ్యాలను అందుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన పిల్లందరికి వ్యాధి నిరోధక టీకాలు అందించేందుకు చొరవ చూపించాలని సూచించారు.
బాల్యానికి భరోసానివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



