7న బహిరంగ సభ… వేలాదిగా తరలిరండి : రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలడుగు, చుక్క రాములు పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభలు ఈనెల 7 నుంచి 9వరకు మెదక్ పట్టణంలో జరుగనున్నాయి. 7న బహిరంగ సభ నిర్వహిస్తున్నామనీ, ఆ సభలో జాతీయ నేతలు పాల్గొననున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ తెలిపారు. బహిరంగ సభకు కార్మికులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపుని చ్చారు. మంగళవారం హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కేంద్రం కార్యకర్తల సమావేశంలో మహాసభల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభల ప్రారంభ రోజున మెదక్ పట్టణంలో బహిరంగసభ నిర్వహి స్తున్నామని తెలిపారు.
ఈ సభకు ముఖ్యవక్తగా సీఐటీయూ ఉమ్మడిరాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత, జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని చెప్పారు. మహాసభను అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ప్రారంభిస్తారని అన్నారు. రాష్ట్రంలోని సోదర కార్మిక సంఘాల నేతలు హాజరై తమ సౌహార్థ సందేశాలను ఇస్తారని తెలిపారు. మహాసభ నిర్వహణకు జిల్లాల్లో అసంఘటిత రంగ కార్మికుల నుంచి, స్కీం వర్కర్లతోపాటు ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభలకు వచ్చే ప్రతినిధులకు బస ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. కీలకమైన సందర్భంలో ఈ మహాసభలు జరుగుతు న్నాయన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొత్తం కార్మిక వర్గానికి ఉచ్చు బిగించిందనీ, దీన్ని ప్రతిఘటించాల్సిన అవశ్యకత కార్మికవర్గం ముందున్నదని గుర్తు చేశారు. యాజ మానుల, కార్పొరేట్ల గరెసెల్లోకి లాభాల వరద పారించేందుకే లేబర్ కోడ్‌లను అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై సమరశీల పోరాటా లకు కార్మికులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయకుండా తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు నాలుగు లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందిం చనున్నట్టు తెలిపారు. ఈ సమవేశంలో రాష్ట్ర ఉపాద్యక్షులు ఎస్వీ రమ, భూపాల్, వీఎస్.రావు, రాష్ట్ర కార్యదర్శులు ఎం.పద్మశ్రీ, వి.శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, పి. సుధాకర్, ఎ.సునిత తదితరులు పాల్గొన్నారు.



