Wednesday, December 3, 2025
E-PAPER
Homeజాతీయంగోప్యతపై మోడీ తాజా దాడి

గోప్యతపై మోడీ తాజా దాడి

- Advertisement -

సీపీఐ(ఎం) విమర్శ

న్యూఢిల్లీ : భారత్‌లోకి కొత్తగా వచ్చే ప్రతి ఫోన్‌లో ఇక ‘సంచార్‌ సాథీ’ నిఘా యాప్‌ ముందుగానే అప్‌లోడ్‌ చేయాల్సి రావడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా విమర్శించింది. ఇది ప్రజల గోప్యతా హక్కుపై తాజాగా దాడి చేయడమేనని పేర్కొంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ప్రజల నుంచి ఎలాంటి ఆమోదం కోరలేదని, ఎంచుకునేందుకు వారికి అవకాశం ఇవ్వలేదని, ప్రజలతో చర్చలు, సంప్రదింపులు జరపలేదని పార్టీ విమర్శించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్టు చేసింది. ప్రతి ఫోన్‌లోనూ ఈ ప్రభుత్వ నిఘా వ్యవస్థను బలవంతంగా ఎక్కించేలా ఒత్తిడి తీసుకువస్తున్నారని పేర్కొంది. ”ఐఎంఈఐ మోసాన్ని నివారించడం” అనే సాకుతో కింది స్థాయి నుంచి ఈ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొంది. ఇది మోసాన్ని నివారించడం కాదని, మొత్తంగా డిజిటల్‌ నిఘాకు పాల్పడటమేనని, ప్రాధమిక హక్కు అయిన గోప్యతా హక్కుపై ప్రత్యక్షంగా దాడి జరపడమేనని విమర్శించింది. ఈ రాజ్యాంగ విరుద్ధమైన ఉల్లంఘనను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తోందని ఆ పోస్టు పేర్కొంది. తక్షణమే ఈ చర్యను ఉపసంహరించుకోవాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని, ప్రజల ఫోన్లకు దూరంగా వుండాలని కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -