నవతెలంగాణ – హైదరాబాద్: హయత్ నగర్‌లో మూగ బాలుడు ప్రేమ్‌చంద్‌పై నిన్న వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటనపై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఉదయం ఆ వార్తను వివిధ పత్రికల్లో చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. సీఎంవో అధికారులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం వెంటనే అందజేయాలని సూచించారు. అదేవిధంగా బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక జీహెచ్ఎంసీ కమిషనర్ స్వయంగా బాలుడిని పరామర్శించటంతో పాటు బాధిత కుటుంబాన్ని వెంటనే కలవాలని, వారి బాగోగులు పరిశీలించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆదేశించారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. తక్షణం వీధి కుక్కల కట్టడిపై అధికారులు చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.
కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. స్పందించిన సీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



