- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో దేశంలోనే తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఏర్పాటు కానుంది. హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోనే ఇది రెండో మహిళల ఫుట్ బాల్ అకాడమీ అవుతుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో ఫిఫా – ఏఐఎఫ్ఎఫ్ ఫుట్ బాల్ అకాడమీల వివరాలను ప్రకటించనున్నారు. ఈ సదస్సులో హైదరాబాద్‌లో అంతర్జాతీయ చెస్ నిర్వహణకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడనుంది.
- Advertisement -



