- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సీఎం పర్యటించనున్నారు. సాయంత్రం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ కు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ కోసం హుస్నాబాద్ పట్టణంలోని ఏనే వద్ద మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణంలోనే హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 262.68 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పలువురు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
- Advertisement -



