నవతెలంగాణ-హైదరాబాద్: మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది. మండలంలోని నోముల గ్రామంలో సర్పంచ్ పదవీకి బహుముఖ పోటీ నెలకొంది. పార్టీల పరంగా బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఆయా పార్టీల నేతలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. అదే విధంగా స్వతంత్ర అభ్యర్థులుగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన కుంచం దివ్యగోపీ, ఆలకుంట్ల సరితసైదులు(ASR) నామినేషన్లు దాఖలు చేశారు. అదే విధంగా మొత్తం గ్రామంలో 12 వార్డులు ఉండగా..ఆయా వార్డులకు ప్రధాన పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. ఈరోజు నామినేషన్ల ఉపసంహరణ నేపథ్యంలో పోటీలో ఎవరు ఉంటారో తెలనుంది.
నేడే నామినేషన్ల ఉపసంహరణ..బరిలో ఎవరుంటారు..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



