- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు జాసిర్ బిలాల్ వాని ఎన్‌ఐఎ కస్టడీని బుధవారం ఢిల్లీ కోర్టు వారం రోజులు పొడిగించింది. ప్రిన్సిపల్ సెషన్స్ మరియు జిల్లా జడ్జి అంజు బజాజ్ చంద్నా నవంబర్ 27న జారీ చేసిన ఏడు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆయనను నేడు ఎన్‌ఐఎ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లోని ఖాజీగుండ్ నివాసి అయిన వానీని ఎన్‌ఐఎ అధికారులు నవంబర్ 17న శ్రీనగర్ నుండి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
- Advertisement -


