నవతెలంగాణ-నసురుల్లాబాద్
దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేలా కృషి చేస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని నసురుల్లాబాద్ మండల విద్యాధికారి చందర్ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ మైదానంలో దివ్యాంగల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు, స్పెషల్ టీచర్లను మరియు అధిగమించిన విద్యార్థులను గౌరవ పూర్వకంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి చందర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమాజంలో సకలాంగులతో సమానంగా జీవించు టకు ముందుకు సాగాలని అన్నారు.
ప్రతీవ్యక్తిలో ఒక ప్రత్యేకత, నైపుణ్యం ఉంటుందని, దివ్యాంగులలో ఎంతో నైపుణ్యం గల వారు ఉన్నారని అన్నారు. సమాజంలో ఉన్నతస్థాయిలో జీవించుటకు వికలాంగులకు అంగవైకల్యం అడ్డుకాదని, పట్టుదలతో కృషిచేస్తే లక్ష్యాలను సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. హన్మoడ్లు, ఉపాధ్యాయులు గోపాల్, లక్ష్మణ్, కాంచన, పుష్పలత, అనూష, స్వప్న, రూప, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



