Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నామినేషన్ సెంటర్స్ ను పరిశీలించిన ఎంపీడీవో

నామినేషన్ సెంటర్స్ ను పరిశీలించిన ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఖండేబల్లుర్, డోన్గాం గ్రామాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ సెంటర్లను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నామినేషన్ సెంటర్లలో ఏర్పాటుచేసిన సౌకర్యాలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పోలీసు సిబ్బందితో కలిసి పరిశీలించారు. గ్రామపంచాయతీ ఎన్నికల  సెంటర్లలో నామినేషన్లు స్వీకరణ మొదటి రోజు నేడు కావడంతో మండలంలో ఏర్పాటు చసిన 10 నామినేషన్ సెంటర్ల కార్యాలయాలను వెళ్లి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులు క్రమశిక్షణగా ఉంటూ నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కార్యకర్తలకు నిబంధనల ప్రకారం కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో తీసుకువెళ్లాలని అధికారులు నిబంధనలు పాటించాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సిబ్బందితో  మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపీడీవో తో పాటు ఖండేబల్లూర్ , డోన్గాం జీపీ కార్యదర్శులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -