నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని రామారావుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు ప్లేజోన్ స్పోర్ట్స్ డ్రెస్సులను విద్యార్థులకు అందజేసినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా స్పోర్ట్స్ యూనిఫామ్స్ అందజేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరారు. ప్లేజోన్ వల్ల పిల్లలు ఒకసారి మానసిక ఉల్లాసానికి ఎంత దోహదపడతాయన్నారు. ఈ ప్లే జోన్ కి దాదాపుగా రూ.5 లక్షల వ్యయంతో నిర్మించడంపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్లేజోన్ డ్రెస్సులు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



