Wednesday, December 3, 2025
E-PAPER
Homeఆదిలాబాద్మూర్చవ్యాధితో వ్యక్తి మృతి

మూర్చవ్యాధితో వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని పార్డి (బి ) గ్రామానికి చెందిన నాగుల ఇరేష్ (40) బుధువారం మృతి చెందడం జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలపిన వివరాల ప్రకారం.. నాగుల ఇరేష్ అనే కూలి ప్రతి రోజు కూలి పనులు చేసుకుంటుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఎప్పటిలాగే ఉదయం 10 గంటలకు మొక్క జొన్న పంటకు సాగు నీరు అందించేందుకు కూలికి వెళ్ళాడు. సాయంత్రం సమయంలో అతనికి ఒక్కసారిగా పిడ్స్ వచ్చాయి. ఈ క్రమంలో నీటికాలువలో బోర్లా పడిపోయాడు. ముక్కు లోకి, నోట్లోకి నీళ్లు పోవడంతో ఊపిరి ఆడక అక్కడిక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి ఎరన్న ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ కృష్ణ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -